ప్రజాశక్తి- చీరాల : ఇంటి బయట పార్కింగ్ చేసిన బైకును గుర్తుతెలియని తగల పెట్టిన పెట్టిన ఘటన పట్టణంలోని 24వ వార్డు శ్రీరామ్ నగర్ బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు ఇప్పిలి శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాంత్ మెడికల్ షాపులో పనులు ముగించుకొని ఇంటి వద్ద ఎప్పటిలాగే బైక్‌ను పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై పెట్రోల్ పోసి నిప్పటించారు. స్థానికులు గమనించి మంటను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే బైకు పూర్తిగా దగ్ధమైంది. ఈ మేరకు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో బాధిడుతు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటగనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సిసి కెమెరాలలోని ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ పని ఆకతాయిల చేశారా? లేక గిట్టని వారు ఉద్దేశపూర్వకంగా చేశారా? అనే కోణంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.










