సచివాలయం సెక్రటరీకి వినతి పత్రం ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ఎస్‌కెడి కాలనీ 21వ వార్డు సచివాలయం పక్కన ఉన్న బావికి కంచె ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, నాయకులు వీరేష్, వెంకటేష్, శ్రీనివాసులు, రామానాయుడు, నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయం పక్కన ఉన్న బావిని పరిశీలించి సచివాలయ సెక్రటరీలు నాగలక్ష్మి, వీరాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సచివాలయం పరిధిలో మహాత్మ గాంధీ నగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు నాడు-నేడు పనుల కింద ప్రహరీ నిర్మించాలని కోరారు. ఎస్‌కెడి కాలనీలో ఉన్న పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, శివ శంకర్ నగర్‌లో పెద్ద కాలువలో సిల్టు తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్‌కెడి కాలనీలో ప్రధాన రోడ్లలో వీధిలైట్లు వేయాలని కోరారు.










