
ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్శిటిలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశా యి. మహిళల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం సారయంత్రం జరిగిన ఫైనల్స్‌లో విశాఖ జిల్లా జట్టుపై 40-31 పాయింట్లతో గుంటూరు జిల్లా జట్లు జయకేతనం ఎగురవేసింది. ఉదయం జరిగిన మహిళల సెమీఫైనల్స్‌లో గుంటూరు జిల్లా జట్టు తూర్పుగోదావరి పైనా విశాఖ జిల్లా జట్టు కడప జిల్లా జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో సెమీఫైనల్స్‌లో ఏలూరు జిల్లాజట్టుపైన విశాఖ జిల్లా జట్టు గెలుపొందగా అనకాపల్లి జట్టుపై నంద్యాల జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరాయి. విశాఖ, నంద్యాల జిల్లా జట్ల మధ్య మ్యాచ్‌లో 59-55 పాయింట్లతో విశాఖ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. అనంతరం విజేత జట్లకు బహుమ తులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శారు రిటైర్డ్ బాస్కెట్ బాల్ చీఫ్ కోచ్ సాయిబాబా, రిటైర్డ్ డీఎస్పీ మదన్ మోహన్, ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.హరికృష్ణ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ కె.రాజేంద్రప్రసాద్, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పి.జాన్సన్, జి.వి.ఎస్ కృష్ణారెడ్డి, వి.విష్ణు మోహనరావు పాల్గొన్నారు.