ఏలూరు:జాతీయస్థాయి బాస్కెట్ బాల్ జట్టుకు పెదవేగి మండలం విజయరాయి పంచాయతీ కార్యదర్శి వలపుల సౌజన్య ఎంపికయ్యారు. ఈ నెల తొమ్మిదో తేదీన విజయవాడలో జరిగిన అఖిల భారత సివిల్ ఎంప్లాయీస్ స్టేట్ సెలెక్షన్స్‌లో సౌజన్య జాతీయస్థాయికి ఎంపికైంది. జాతీయస్థాయి క్రీడలు అక్టోబర్‌లో జరగనున్నాయి. జిల్లా నుంచి ఎంపికైన సౌజన్య రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెడ్‌పి ఛైర్‌పర్సన్ జి.పద్మశ్రీప్రసాద్, జిల్లా అధికారులు అభినందించారు. జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాసవిశ్వనాధ్ మాట్లాడుతూ సౌజన్య ఇటు విధుల్లోను, అటు క్రీడల్లోనూ రాణిస్తుందన్నారు.










