ప్రజాశక్తి-విజయవాడ: ఈ నెల 27న జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. బార్ అసోసియేషన్ హాలులో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ డిపి రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కెబి సుందర్, ఉపాధ్యక్షులుగా పుప్పాల శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ జన్ను శ్రీధర్, జాయింట్ సెక్రెటరీ నరహరిశెట్టి జ్యోతి లైబ్రేరియన్ సెక్రటరీ ఆకుల పాండురంగ విటల్ , కోశాధికారి బత్తుల వెంకటేశ్వర్లు , లేడీస్ సెక్రటరీ పెనుమాల జయలక్ష్మి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా పగడాల ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ బెజవాడ బార్ అసోసియేషన్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు.










