విద్యార్థి అమర్నాథ్‌కు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి శ్రేణులు
ప్రజాశక్తి-బాపట్ల: రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి చేతిలో అన్యాయంగా హత్యకు గురైన విద్యార్ధి ఉప్పాల అమరనాథ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బాపట్ల అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. 'గంజాయి మత్తులో వైసిపి సైకోలు' అనే బ్యానర్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ వేగేశన నరేంద్రవర్మ, సలగల రాజశేఖర బాబు, పల్లం సరోజిని, నక్కల వెంకటస్వామి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










