Apr 02,2023 00:55
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్‌ 5న జరిగే కార్మిక, కర్షక ర్యాలీ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌ కోరారు. శనివారం శనివారం బాపట్ల పాత బస్టాండ్‌లోని ఆటోస్టాండ్‌ వద్ద చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మజుందార్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 5న ఢిల్లీలో మహా ప్రదర్శన జరుగుతుం దని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐదు లక్షల మందితో ర్యాలీ జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో కార్మికవర్గం పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభు త్వం ధరలను విపరీతంగా పెంచుతుందని ఉద్యోగుల హక్కుల ను కాలరాస్తూ కార్మిక చట్టాల్ని కార్పొరేట్‌ సంస్థలకు అనుకూ లంగా చేసిందని విమర్శించారు. రైతు గిట్టుబాటు ధర కల్పిస్తారని హామీని నేటికీ అమలు చేయలేదు. విద్యుత్‌ చట్టం తీసుకొచ్చి విద్యుత్‌ మొత్తాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ నాయకులు వై శ్రీనివాసరావు, మూర్తి, కృష్ణ పాల్గొన్నారు.