Apr 17,2023 01:28
అన్న క్యాంటిన్‌లో భోజనం వడ్డిస్తున్న నరేంద్రవర్మ

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్లకు చెందిన చంద్ర వీరస్వామి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు శ్రీనివాస్‌ సహకారంతో ఆదివారం 350 మంది పేదలకు అన్న క్యాంటీన్‌ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్ల టిడిపి కార్యాలయంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్‌ 168వ రోజుకు చేరింది. ఆదివారం పేదల ఆకలి తీర్చే ఇంత బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై తమ సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్రవర్మ చిరు సత్కారం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గొలపల శ్రీనివాసరావు, దాతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.