Sep 28,2023 23:13

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
ఫోటో గ్రఫీలో ప్రతిభ కలిగిన ఫోటోగ్రాఫర్లను ప్రపంచ పర్యాటక  దినోత్సవం సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సంసృతి సమితి ప్రొత్సాహంతో  విజయవాడ ఫోటోగ్రఫీ అకాడమి ఆఫ్ ఇండియా, ఇండియా ఇంటర్నెషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ సంయుక్తంగా సత్కరించారు. ప్రపంచ పర్యాటక  దినోత్సవం సంధర్భంగా రాష్టం వ్యాప్తంగా నిర్వహించిన ఛాయాచిత్ర పోటీల్లో  మండలంలోని ముత్తాయపాలెంకు చెందిన ఫోటోగ్రాఫర్ పివిఎస్ నాగరాజు,  ఆదర్శనగర్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ సంగాని ఏడుకొండలు, నిజాంపట్నంకు చెందిన ఫోటోగ్రాఫర్ దబ్బకూటి శ్రీనివాసరావుకు ప్రతిభ పురస్కార్ అవార్డు,  బంగారు పథకాలు సాధించారు. ఈ పురస్కారాలను విజయవాడ బాలోత్సవ భవన్‌లో బుధవారం జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో అడిషనల్ సీసీఎల్ఏ  సెక్రెటరీ, సెర్ప్ సీఈఓ, డైరెక్టర్ ఏపి స్టేట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఎ ఇంతియాజ్   చేతుల మీదగా అందుకున్నారు. కార్యక్రమములో ఫోటోగ్రఫీ అకాడమి ఆఫ్ ఇండియా పౌండర్ చైర్మెన్ తమ్మా శ్రీనివాసరెడ్డి, ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ వెంకటరమణ, గోళ్ళ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన ఫోటో గ్రాఫర్లను పలువురు అభినందించారు.