పర్చూరు తహశీల్దారుకు వినతిపత్రం అందిస్తున్న ఆర్యవైశ్యులు
ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మది నోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్చూరు తహశీల్దారును కలిసి బాపట్ల జిల్లాకు రోశయ్య పేరు పెట్టాలని వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొణిజేటి రోశయ్య జిల్లా సాధన సమితి అధ్యక్షులు మామిడిపాక హరిప్రసాద్, దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరాం సుబ్బారావు, కోట శ్రీనివాసరావు, బి భాస్కర్‌రావు, వెంకటేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు, కిరణ్, వీరాంజనేయులు తదితరులు ఉన్నారు.










