స్విమ్మింగ్ అసోసియేషన్‌కు ఎంపికైన సభ్యులు
ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: ఆదివారం బాపట్ల జిల్లా మంతెనవారిపాలెంలో బాపట్ల జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నికలు, జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ స్విమ్మింగ్ అసోసియేషన్ తరపున పరిశీలకులుగా రమేష్ హాజరయ్యారు. వీరి సమక్షంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా కూసంపూడి రాకేష్‌వర్మ, ఉపాధ్యక్షుడుగా చింతల వినరు చౌదరి, సెక్రటరీ మంతెన నాగ మురళి, జాయింట్ సెక్రటరీ ఖాజా మొహిద్దీన్, ట్రెజరర్‌గా దండు శివరామరాజు ఎన్నికయ్యారు.










