Nov 08,2023 21:42

ఫొటో : మాట్లాడుతున్న సిఐ వెంకటేశ్వరరావు

బాణసంచా దుకాణదారులకు సూచనలు
ప్రజాశక్తి-కోవూరు : దీపావళి పర్వదినం సందర్భంగా దుకాణాలు ఏర్పాటు చేసే కోవూరు, ఇందుకూరుపేట మండలాలకు సంబంధించిన వ్యాపారస్తులు దానికి సంబంధించిన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోవూరు సిఐ డి.వెంకటేశ్వరరావు అన్నారు. కోవూరులోని సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్థేశించిన నియమ నిబంధనలకు లోబడి షాపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఎక్కడైనా అక్రమంగా టపాసులు తయారు చేయడం నిషేధమన్నారు.
అటువంటి చర్యలకు పాల్పడితే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా షావు ప్రాంతాల్లో అగ్నిమాపక నిరోధ యంత్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక, నీళ్లు తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. ఈ బాణాసంచా వ్యాపారస్తులు తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా లైసెన్సు పొంది ఉండాలన్నారు. కార్యక్రమంలో కోవూరు ఎస్‌ఐ రంగనాథ్‌ గౌడ్‌, ఇందుకూరుపేట ఎస్‌ఐ రవీంద్రబాబు, తదితరులు ఉన్నారు.