Oct 23,2022 22:32

పజాశక్తి-ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం, కొండపల్లిలోని దీపావళి బాణా సంచా స్టాల్స్‌ను విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రానా టాటా ఆదివారం పరిశీలించి భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించారు. ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్మెంట్లను పరిశీలించారు. పూర్తి భద్రత వహించాలని, స్టాల్స్‌ లో మైనర్లు ఉండకుండా చూడాలన్నారు, స్టాల్స్‌ వద్ద పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. బాణాసంచా దుకాణాల వద్ద పూర్తి భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సిపి వెంట వెస్ట్‌ జోన్‌ ఎసిపి హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఐ శీను కొండపల్లి సెక్టార్‌ ఎస్సై పాపారావు ఉన్నారు