Nov 04,2023 23:07

ప్రజాశక్తి - గోకవరం మండల కేంద్రమైన గోకవరం సంత మార్కెట్‌ వద్ద దీపావళికి బాణా సంచా అమ్మక స్థలాన్ని తహశీల్దార్‌ ఎ.శ్రీనివాస్‌, అగ్ని మాపక అధికారి ఆర్‌.గోవిందు పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే దీపావళి పండుగను పురస్కరిం చుకుని దీపావళి సామాన్లు అమ్మకాల షాపులకు సంత మార్కెట్‌ అనువుగా ఉంటుందని, ఎవరికీ ఎటువంటి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా సంత మార్కెట్‌ ఉంటుందని తెలిపారు. ఈ పరిశీలనలో వరసాల ప్రసాద్‌, బత్తుల నానాజీ, పులపర్తి బుజ్జి, పంచాయతీ కార్యదర్శి టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.