ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: బాలయ్య బాబు అభిమానుల కోరిక మేరకు భగవంత్ కేసరి సినిమా ఫాన్స్ షోను ఉచితంగా ఏర్పాటు చేసిన గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం బాలయ్య అభిమానులు ఆధ్వర్యంలో గురజాల జగన్ మోహన్‌కి ఘనసన్మానం చేశారు. చిత్తూరు నగరంలోని స్థానిక గిరింపేట వద్ద పునర్నిర్మానంతో నూతన హంగులతో నిర్మించిన శ్రీవెంకటేశ్వర థియేటర్ గురువారం ప్రారంభమైన సందర్భంగా నందమూరి బాలకష్ణ నటించిన భగవంత్ కేసరి ఫాన్స్‌షోను సీనియర్ టిడిపి నాయకులు జీజేఎం ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్ నాయుడు తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దసరా సందర్భంగా నందమూరి బాలకష్ణ వినూత్న కథతో నటించిన భగవంతు కేసరి విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. నూతన హంగులతో ఏర్పాటు అయినా శ్రీ వెంకటేశ్వర థియేటర్‌లో ఈ చిత్రం విడుదల కావడం చిత్తూరు నగర ప్రజలకు దసరా సంబరాలను తీసుకువచ్చిందన్నారు. నగర ప్రజలు నందమూరి అభిమానులు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని భారీఎత్తున విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు వినరు చౌదరి, హేమాద్రి నాయుడు, ఎల్‌బి నాయుడు, అన్వేష్, కిరణ్ పాల్గొన్నారు.










