Jul 11,2023 21:18

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్‌పి విక్రాంత్‌పాటిల్‌

పార్వతీపురం రూరల్‌: ఐఆర్‌టిడబ్ల్యుఎ స్వచ్ఛంద సంస్థ నిర్వహి స్తున్న బాల్య వివాహాల నిషేధంపై అవగాహన కార్యక్రమానికి సంబం ధించి గోడపత్రికను మంగళ వారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతు బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎటువంటి సమాచారం దగ్గర్లో ఉన్నా పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌కు తెలపాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ పి.కె. ప్రకాష్‌ పాల్గున్నారు.