Aug 26,2023 23:56

తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:బాల్య వివాహం చేస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. మండలంలోని ఉపమాకలో పదో తరగతి చదువు కుంటున్న బాలికకు వివాహం చేస్తున్నారన్న సమాచారంతో ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ లలిత, పంచాయతీ కార్యదర్శి జయప్రకాష్‌, విఆర్వో దేవుళ్ళు, మహిళా కానిస్టేబుల్‌ హేమలత, అంగన్వాడి కార్యకర్తలు పద్మ, మాధవి తదితరులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. 18 సంవత్సరాల నిండకుండా ఆడపిల్లకు పెళ్లి చేస్తే వారి ఆరోగ్యం పాడవుతుందన్నారు.చట్ట ప్రకారం బాల్యవివాహాలు నేరమన్నారు. బాల్య వివాహాలను నిరోధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కొప్పిశెట్టి హరిబాబు, కొల్లాటి బుజ్జి పాల్గొన్నారు.