Jan 23,2023 23:40

వధూవరుల కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్న అధికారులు

ప్రజాశక్తి   ముంచింగిపుట్టు: మండలంలోని దారేల పంచాయతీ గన్నేడ గ్రామానికి చెందిన పాతికేళ్ల నివాసి కోర్ర సింహాచలానికి కించాయిపుట్టు పంచాయతీ రాములు గ్రామానికి పదిహేనేళ్ల బాలికతో జరగనున్న బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. మంగళవారం బాల్యవివాహం జరుగుతోందని సచివాలయం మహిళ పోలీస్‌, అంగన్వాడి కార్యకర్త, గ్రామ పెద్దలు ఇచ్చిన సమాచారం మేరకు సిడిపిఒ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు, పోలీస్‌ సిబ్బంది గ్రామానికి వెళ్లి వధూవరులతోపాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అంతేకాక బాల్యం వివాహం చేయడం వల్ల భార్యాభర్తలతోపాటు వారికి పుట్టబోయే పిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు అమ్మాయికి 18ఏళ్లు నిండేవరకు ఆగి తర్వాత పెళ్లి చేయాలని సూచిస్తూ, బాలికను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిబంధనలు అతిక్రమించి వివాహం జరిపిస్తే చట్టరీత్యా నేరస్తులౌతారని హెచ్చరించి వదిలేశారు.