Oct 12,2023 20:33

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి

రాజంపేట అర్బన్‌ : బాల్య వివాహాలను అరికట్టి బాలికల నిష్పత్తిని పెంచాలని ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి అన్నారు. బాల్య వివాహాల చట్టంపై ఆర్‌డిఒ కార్యాల యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో, బేటి పడావో అనే నినాదంతో 2014 అక్టోబర్‌లో పథకాన్ని ప్రారంభించి బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేసి వారి నిష్పత్తిని పెంచేందుకు కావలసిన చర్యలు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లాను కూడా ఎంపిక చేశారన్నారు. ప్రతి 1000 మంది బాలికలకు 989 మంది బాలికలు మాత్రమే ఉన్నారని, ఆడపిల్లల మనుగడ, రక్షణ, సాధికారత దిశగా కషి చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని తెలిపారు. బాల్య వివాహాల చట్టంను సిఎంపిఒల ఆధ్వర్యంలో పకడ్బందీగా అమలు పరచనున్నట్టు తెలిపారు. బాల్య వివాహాల చట్టం-2006 జిఒ 31,39ను అమలు చేయాలని అధికారులకు సూచించారు. సిఎంపిఒలుగా మండల స్థాయిలో విఆర్‌ఒలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంరక్షకులు, మండల స్థాయి అధికారులు ఉంటారని.. వారు డివిజన్‌ స్థాయిలో సమన్వయం తో పని చేసే విధంగా విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం బాల్య వివాహల నిషేధ గోడపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో డివిజన్‌లోని అన్ని మండలాల అధికారులు, పోలీసు విభాగం, ప్రధానో పాధ్యాయులు, తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు.