Sep 27,2023 23:34

తాడికొండ: బాల్య వివాహాలు చట్టవ్యతిరేకం అని ఎంపిడిఒ అత్తోట దీప్తి అన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాల్యవివాహాల నిరోధక అధికారులతో ప్రణాళిక సమన్వయ సమావేశం నిర్వ హించారు ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ బాల్యవివాహాల వలన కలిగే అనర్థాల గురించి, బాల్య వివాహాలు జరగకుండా ముందుగానే గుర్తించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై వివరించారు. గతంలో బాల్యవివాహం జరిగి ఇప్పటి వరకు అధిóకారుల దృష్టికి రాని కేసులకు సంబంధించి ఎటువంటి ప్రణా ళికతో కేసులు నమోదు చేయవచ్చు, వివాహ నమోదు ప్రక్రియ, గ్రామస్థాయి / వార్డు స్థాయి బాల్యవివాహ నిషేధిత పర్యవేక్షణ కమిటీలు, బాల పంచాయితిలు, బాల కమిటీలు సభ్యులకు ఏ విధంగా అవగాహన కల్పించాలనే అంశాలపై శిక్షణ అందించారు. అనంతరం పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తక్కువ ఖర్చుతో ఎక్కవ పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలను అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసి ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్‌ ప్రసాద్‌ ఎంఇఒ టి.ఇందిర, ఎపిఎం సాంబశివరావు , ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ విజరు కుమార్‌ పాల్గొన్నారు.