బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ప్రజాశక్తి - ఓజిలి: బాల్య వివాహాలపై అవగాహన సదస్సును మండల కేంద్రం లోని స్త్రీ శక్తి భవనంలో ఎంపీడీవో రజనీ కాంత్ , ఏపీఎం నిర్మల ఆధ్వర్యంలో నిర్వ హించారు. ఈ సంద ర్భంగా వారు మాటా ్లడుతూ బాల్య వివాహాలు నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని పిలుపు నిచ్చారు. బాల్యవివాహాలు చేసినా ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమని బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్థాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, సిహెచ్‌ఓ రామయ్య, ఈవోపిఆర్‌డి మోహన్, సీసీ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ రవి, సీసీలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.










