Nov 04,2023 21:03

మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి అంజని ప్రియదర్శిని

రైల్వేకోడూరు : బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.అంజని ప్రియదర్శిని అన్నారు. శనివారం మండలంలోని అనంతరాజుపేట ఎస్‌టి బాలికల మినీ గురుకుల పాఠశాలలో మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జూనియర్‌ సివిల్‌జడ్జి అంజని ప్రియదర్శిని పాల్గొని మాట్లా డారు. బాల్య వివాహం పిల్లల హక్కులను ఉల్లంఘిస్తోందని, బాల్య వివా హం పిల్లల విద్య, ఆరోగ్యం, రక్షణ, హక్కులను ప్రతికూలంగా ప్రభా వితం చేస్తుందని అన్నారు. చిన్నతనంలోనే అవగాహన లోపంతో కొంత మంది తల్లిదండ్రులు ఆడపిల్లలను భారంగా భావించి యుక్త వయసు రాక ముందే పెళ్లి చేస్తున్నారని అన్నారు. అటువంటి ఆడపిల్లలకు జీవితం పైన బాధ్యత లపై సరైన అవగాహన లేకపోవడం గహహింసను అనుభ వించే అవకాశం ఉంటుందన్నారు. అమ్మాయిలు బాగా చదువుకొని తల్లిదం డ్రులకు, చదువు చెప్పిన ఉపాధ్యా యులకు, సమాజానికి మంచి పేరు తేవా లని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సిఐ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా తల్లిదండ్రులు గానీ, మన చుట్టుప్రక్కల వారు ఆడపి ల్లలకు బలవంతంగా బాల్య వివాహం జరిపిస్తున్నట్లయితే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుం టామని చెప్పారు. 1098 నెంబర్‌కు ఫోన్‌ చేసి బాల్య వివాహం జరిగే స్థలం పేరు చెబితే 15 నిమిషాలలో అక్కడికి పోలీసు, రెవెన్యూ, ఐసిడిఎస్‌ అధికా రులు ప్రభుత్వ సంస్థల సహకారంతో ఆ వివాహాన్ని అడ్డుకొని పెద్దలకు నచ్చజెప్పేందుకు కౌన్సిలింగ్‌ ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎ.వెంకట్రా మరాజు, సీనియర్‌ న్యాయవాదులు ఎం.సురేష్‌రెడ్డి, ఎం.శంకరయ్య, టి.చంద్రమోహన్‌, ఎస్‌ఎం అంబిక పాఠశాల ప్రధానోపాధ్యా యులు కవిత పాల్గొన్నారు.