
ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: బాల్య వివాహ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని అందుకు తగిన విధంగా సలహాలు ఇవ్వాలని పలువురు వక్తలు అన్నారు. బచ్‌పన్ ఆందోళన్, ఎపి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంయుక్తంగా నగరంలోని స్వర్ణా ప్యాలెస్ హోటల్‌లో సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్ పర్సన్ డాక్టర్ కేసలి అప్పారావు మాట్లాడుతూ బాల వివాహాలపై పలు అంశాలపై కూలంకుషంగా చర్చించి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా మార్చడానికి కావాల్సిన సలహాలను అందచేయాలన్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను కూడా రూపొందించినట్లు తెలిపారు. 2025 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి సంస్థ కమిషనర్ ఎం.జానకి తదితరులు పాల్గొన్నారు.