సచివాయాల శాఖ సామాజిక ప్రవర్తన మార్పు సమాచార విభాగం కో-ఆర్డినేటర్ టిఎన్.స్నేహాన్
ప్రజాశక్తి - దెందులూరు
చిన్నతనంలో వివాహాలు చేసుకోవటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని సచివాయాల శాఖ సామాజిక ప్రవర్తన మార్పు సమాచార విభాగం కో-ఆర్డినేటర్ టిఎన్.స్నేహాన్ తెలిపారు. దీంతో బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని కొవ్వలి గ్రామంలో రెండు సచివాలయాలను గురువారం పరిశీలించారు. అక్కడ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సాయంత్రం కొవ్వలి జిల్లా పరిషత్ హైస్కూలులో రక్తహీనత-బాలత వివాహాలు నిర్ములన అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహన్ మాట్లాడుతూ బాల్య వివాహం చేసినా, దొంగతనంగా వివాహం చేసినా 2006 బాల్య వివాహ నిషేధ చట్టం సెక్షన్ 3 ప్రకారం చెల్లదన్నారు. బాల్య వివాహాలు చేస్తే రెండేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారని హెచ్చరించారు. రక్త హీనత లేకుండా ఉండాలంటే పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద, అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ సక్రమంగా అమలయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు. రెండు అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి యుక్త వయసు బాలికలకు తరచూ హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










