Jun 30,2023 21:12

వీడియోకాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి
 రాయచోటి : బాల్య వివాహలను అరికట్టడంపై ప్రత్యేక దష్టి పెట్టాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్‌లతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌ మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హల్‌ నుంచి కలెక్టర్‌ గిరీషా పిఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపే పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు కూడా నేరస్థులు అవుతారని వివరించాలని చెప్పారు. జిల్లాల్లో బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా అమలు చేస్తున్న విద్య, వైద్యం సుస్థిర అభివద్ధి లక్ష్యాలు, జగనన్నకు చెబుదాం వంటి పథకాలను ప్రజలకు సంతప్తి స్థాయిలో లక్ష్యసాధన అందేలా అధికారులు నిబద్దతతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో గర్భిణుల్లో రక్తహీనతను నివారించే విధంగా ఫ్యామిలీ కాన్సెప్ట్‌ డాక్టర్లు తమ సందర్శనలో ప్రత్యేక దష్టి సారించాలన్నారు. మన బడి నాడు నేడు కింద పాఠశాలల్లో చేపడుతున్న అబివద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో సిగల్‌ అందకపోవడంపై ఆ ఏరియాలలో ఫోర్‌ జి టవర్స్‌ ఏర్పాటుకు సంబంధించి వచ్చే శుక్రవారంలోగా స్థలం అప్పగించాలని సూచించారు. ఎన్‌సిడిసిడి సర్వే వంద శాతం పూర్తి చేయాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన ఆర్థికేతర వినతులు సంతప్తి స్థాయి పెంచేలా నాణ్యతతో సత్వరం పరిష్కరించాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం పక్కాగా జిల్లాలో అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఓ కష్ణ నాయక్‌, ఐసిడిఎస్‌ పిడి ధనలక్ష్మి, డిఎంహెచ్‌ ఓ డాక్టర్‌ కొండయ్య, డిఇఓ పురుషోత్తం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఏఓ బాలకష్ణ పాల్గొన్నారు.