బాల్య దశలోనే పలు అంశాలపై
అవగాహన కల్పించాలి
ప్రజాశక్తి -కోట : విద్యను అభ్యసించే చిన్న వయస్సులోనే పలు రకాల అంశాలపై అవ గాహన కలిగి ఉండడం ఉన్నత మైందని శ్రీ చైతన్య స్కూల్ ఫ్రీ ప్రైమరీ ఇంచార్జ్ వినీల అన్నారు. బుధవారం కోట మండలంలోని శ్రీ చైతన్య స్కూల్ లో చదువుతున్న ఫ్రీ ప్రైమరీ పిల్లలు ప్రిన్సిపాల్ ఎమ్.వెంకట సుదీర్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్, అగ్ని మాపక కేంద్రం, తదితర లాంటి పలు ఈవెంట్స్ ను క్షుణ్ణంగా పరిశీంచారు. అంతే కాకుండా పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎస్ ఐ పుల్లారావు,హెడ్ కానిస్టేబుల్ కష్ణమూర్తి లు పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి? వాటి విధులు, విధానాలు క్లుప్తంగా వివరించారు. సమీపంలోని అగ్ని మాపక కేంద్రం ఆవశ్యకతను పిల్లలకు వివరించారు. పిల్లలు ఇలాంటి వాటిపై అవగాహన చేసుకోవాలని బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ప్రభుత్వ ఆసుపత్రి లాంటి ఫీల్డ్ ట్రిప్ లు కేటాయించామని ఫ్రీ ప్రైమరీ ఇంచార్జ్ వినీల తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ పీడీ ఎస్.ఠాగూర్, టీచర్లు పర్వీన్, ప్రీతి, గాయత్రి పాల్గొన్నారు.










