ప్రజాశక్తి-పెదబయలు:స్థానిక గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో గిరిజన గురుకులం కార్యదర్శి ఆదేశాల మేరకు డిప్యూటీ సెక్రటరీ ప్రభాకర్ బందం గురువారం రాత్రి పర్యటించారు. 5నుండి 9 తరగతులకు విద్యార్ధుల నైట్ స్టడీ, ఉపాధ్యాయుల టీచింగ్ డైరీ, లెస్సన్ ప్లాన్ మెథడ్స్ పర్యవేక్షణ చేశారు. నాడు నేడు మనబడి, జగనన్న కిట్స్‌పై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో విడి విడిగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఔట్ సోర్సింగ్ ఉపాద్యాయులు పలు డిమాండ్లతో వినతిపత్రాన్ని అందజేశారు. ఇప్పటి వరకు పది నెలలకే వేతనాలు మంజూరు చేస్తున్నారని, 12 నెలలూ , సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలని కోరారు. హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు.2010 నుండి ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు పిఆర్‌సి వర్తింప చేయలేదని, 2022 పిఆర్‌సి ప్రకారం వేతనాలు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటిడిఎ పరిదిలో ఇష్టానుసారంగా అధికారులు బదిలీ చేయకుండా నియమనిబంధనలు పాటించాలని కోరగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సెక్రటరీ ప్రభాకర్ తెలిపారు.










