ప్రజాశక్తి-సంతమాగులూరు: బాల కార్మికులతో పనులు చేయించే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి తెలిపారు. బుధవారం సంతమాగులూరు ఐసిడిఎస్ కార్యాల యంలో, సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు సంబంధిం చి సిడిపిఓ డి సుధ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పద్మావతి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పద్మావతి మాట్లాడుతూ బాల కార్మిక వ్యతిరేక ప్రత్యేకమైన డ్రైవ్ ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలల కోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి, జగనన్న విద్యా దీవెన, అమ్మ ఒడి, వసతి దీవెన లాంటి మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. బాల కార్మికులను గుర్తించి వారిని పోలీసువారికి గాని, కార్మిక శాఖ వారికి గాని సమాచారం అందించాలన్నారు. లేదా 100కి, 1098కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అలాగే బాల్యవివాహాలను అరికట్టి, బాల బాలికలకు మంచి భవిష్య త్తు అందించాలని అన్నారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త సమయపాలన పాటించి, లబ్ధిదారులకు ఇచ్చే పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలన్నారు. ఎటువంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సిఐ ప్రభాకర్, అంగన్‌వాడీ కార్యకర్తలకు దిశ యాప్ గురించి అవగాహ న కల్పించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం డి మస్తాన్‌రావు, సూపర్‌వైజర్‌లు ప్రమీల, నాగరాజకుమారి, సలోమి, విజయ నిర్మల, సుష్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.










