ప్రజాశక్తి-అద్దంకి: నిరాదరణకు గురైన బాలలను గుర్తించి వారికి మనవంతు సహాయ సహకారాలు అందించినప్పుడే మానవ జీవితం ధన్యం అవుతుందని, వారి పట్ల ప్రేమ, ఆదరణ కలిగి ఉండాలని ప్రకాశం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రోగ్రామ్ మేనేజర్ టి రంగారావు పేర్కొన్నారు. శుక్రవారం అద్దంకిలోని గుర్రాల కాలనీలో పేదరికంతో బాధపడుతున్న అతి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన 8 నెలల చిన్నారి, నాయనమ్మ సంరక్షణలోని మూడు సంవత్సరాల బాలిక ఆ ఇద్దరు బాలికలను ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంతరణ మండలి స్టేట్ ప్రోగ్రాం ఫీల్డ్ ఆఫీసర్ కె రవికుమార్, ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి బాపట్ల ప్రకాశం జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ టి రంగారావు, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఎన్‌విఎస్ రామ్మోహన్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి మేదరమెట్ల హెల్ప్ టిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ ఆ చిన్నారి బాలికలకు నూతన వస్త్రాలు బహూ కరించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రకాశం గుంటూరు జిల్లాల ప్రోగ్రాం ఫీల్డ్ ఆఫీసర్ కె రవికుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ మేదరమెట్ల టిఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీవి సాగర్, హెల్ప్ మేదరమెట్ల టిఐ, అద్దంకి ఓఆర్‌డబ్ల్యు కరుణ పాల్గొన్నారు.










