
సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి
కడప బాలలకు సంబంధించిన పథకాలపై అవగాహన కల్పించాలని అడి షనల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ ఎం. ప్రదీప్ కుమార్ సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి బాలల సంరక్షణ కోసం స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం 2015 పై టీం సభ్యులతో మంగళవారం కోర్టులోని న్యాయ సేవ సదన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలకు సంబంధించిన పథకాలు, జీవోలపై అవగాహన కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు వారికి సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టా లన్నారు. కార్యక్రమంలో టీం సభ్యులు, న్యాయవాదులు, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఉపాధ్యాయులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.