
తాడేపల్లి: విజయవాడ నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో తాడే పల్లి పట్టణంలోని నులకపేట వద్ద ఎపి గిడ్డంగుల సంస్థ ముఠా కార్మికులకు గురువారం బాలల పరిరక్షణపై అవ గాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ శేఖర్‌బాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలలను రక్షించాల్సిన అవసరం అందరిపై ఉంద న్నారు. 18 సంవత్సరాలు లోపు వయసు గల ప్రతిఒక్కరికి రక్షణగా నిలవాలన్నారు. కొట్టడం, తిట్టడం మాని వారి అబి óప్రాయాలను, మాటలకు విలువిచ్చి గౌరవించాలని కోరారు. బాలల పట్ల లైగింగ వేధింపులు లాంటి సంఘటనలు జరగ కుండా చూడాలని కోరారు. మత్తు పదార్ధాలకు అలవాటు పడకుండా మంచి సమాజం నిర్మించడానికి కృషి చేయా లన్నారు. కార్యక్రమంలో సంస్థ జోనల్ కోఆర్డినేటర్ డి.రమేష్, ముఠా మేస్త్రి ఎం.చెన్నయ్య పాల్గొన్నారు.