Nov 20,2023 21:34

మాట్లాడుతున్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పీడీ బిఎన్‌ శ్రీదేవి

           ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం    బాలల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ పీడీ బిఎన్‌ శ్రీదేవి తెలిపారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం బాలల హక్కులు అయిన జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్య హక్కులను కావాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అలాగే బాలలు కూడా తల్లిదండ్రుల మాట వింటూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. కాగా ఆన్‌లైన్‌ మోసాలకు పిల్లలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా సరే సమస్య ఉంటే వెంటనే 1098 చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు కానీ, పోలీస్‌ హెల్ప్‌లైన్‌ 100కుగానీ, ఉమెన్‌ హెల్ప్‌ లైన్‌ 118గాని ఫోన్‌ చేసి తక్షణ సహాయం పొందాలని సూచించారు. ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 జిల్లా కో ఆర్డినేటర్‌ కృష్ణమాచారి మాట్లాడుతూ పిల్లలు లైంగికంగా ఏ విధంగా గురవుతున్నారనే విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ లింగానాయక్‌, సిహెచ్‌ఎల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ కృష్ణమాచారి, కెజిబివి ఇన్‌ఛార్జి భవానీ, డిసిపియుఓఆర్‌డబ్ల్యు వసంతలక్ష్మి, సిహెచ్‌ఎల్‌ స్టాఫ్‌ ఇర్ఫాన్‌, సురేష్‌, నాగలక్ష్మి, సుహాసిని, కేజీబీవీ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.