Nov 14,2023 18:50

వేడుకలు ప్రారంభిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు నారాయణ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ పాఠశాలల ఏజీఎం పెద్దిరెడ్డి పాల్గొని బాలల దినోత్సవ ప్రాధాన్యతను తెలిపారు. విద్యార్థులకు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్కేఎం సుభాని బాల బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూనెహ్రూకి పిల్లలు అంటే చాలా ఇష్టమని అందుకే ఆయన పుట్టినరోజుని బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని వివరించారు. ఆర్‌ ఐ విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టారు.