Aug 24,2023 19:28

విచారణ చేస్తున్న డిఎస్‌పి

విచారణ చేస్తున్న డిఎస్‌పి
బాలికపై అత్యాచారం
ప్రజాశక్తి-వరికుంటపాడు:మండలంలోని ఎస్‌టి కాలనీకి చెందిన సవరం మాల్యాద్రి అదే కాలనీలోని ఓ బాలిక పై మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో పిర్యాదు చేయడంతో పోలీస్‌లు ఆ పాపను చికిత్స నిమిత్తం పామూరు వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం కేసు నమోదు చేశారు. కావలి డిఎస్‌పి వెంకటరమణ వరికుంటపాడు లోని ఓ చిల్లర దుకాణం, కల్లు దుకాణం కాలనీలో విచారించారు. పరారీలోని నిందితుడిని త్వరలో పట్టుకుంటామని అన్నారు.
ఆయన వెంట ఉదయగిరి సిఐ గిరిబాబు, ఎస్‌ఐ విజరు శ్రీనివాస్‌, దుత్తలూరు ఎస్‌ఐ ప్రభాకర్‌ ఉన్నారు.