Jan 31,2023 23:28

జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి
ప్రజాశక్తి -కశింకోట

సమాజంలో బాలికల స్వేచ్ఛగా ఉంటూ ఎదగాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అన్నారు. స్థానిక డిపిఎన్‌ బాలురు హైస్కూల్‌లో స్వాబావన్‌ అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. అనంతరం మెయిన్‌ రోడ్డు వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ 20 సంవత్సరాల వరకు బాల, బాలికలు చదువుపై దృష్టి సారించాలని, సంస్కృతి, సంప్రదాయాలు పాటించాలని సూచించారు. పిల్లలు తమ అభిప్రాయాలను తల్లిదండ్రులతో పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షురాలు కలగా లక్ష్మి, వైస్‌ ఎంపిపి పెంటకోట జ్యోతి, సర్పంచ్‌ మంత్రి జయరజనీ, ఎంపిడిఓ కొంకి అప్పారావు, తహశీల్దారు సుధాకర్‌, ఎపిఎమ్‌ శ్రీనివాసరావు, ఎంఇఒ చిట్టిబాబు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.