
పాఠశాలను తనిఖీ చేస్తున్న డిసిడిఒ ప్రమోద
ప్రజాశక్తి-హనుమంతునిపాడు: పదో తరగతి బాలికలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా బాలికలకు అర్థమయ్యే విధానంలో విద్యను బోధించాలని బాలికల అభివృద్ధి అధికారి ప్రమోద కస్తూర్బాగాంధీ బాలికల ఉపాధ్యాయ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు. హనుమంతునిపాడు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని బాలికల అభివృద్ధి అధికారి ప్రమోద శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి బాలికలకు అందిస్తున్న భోజన మెనూను పరిశీలించారు. వీరి వెంట ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఇందిరా సుహాసిని పాల్గొన్నారు.