Jan 20,2023 23:05

ప్రజాశక్తి-ఎ.కొండూరు 

బాలికలు ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో విద్యావంతులుగా అయినప్పుడే చట్టాల పట్ల అవగాహన చేసుకోగలుగుతారని బాల్యవివాహాలను ప్రతిఒక్క బాలిక వ్యతిరేకించాలని ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ టి .శివకుమారి మరియు ఝాన్సీ మహిళా సంరక్షణ కార్యదర్శి శేషారత్నం అన్నారు శుక్రవారం కిశోర బాలికల దినోత్సవం సందర్భంగా ఎ కొండూరులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బాలికలకు బాల్య వివాహాలు లింగ వివక్షత దిశా చట్టం చైల్డ్‌ హెల్ప్‌ లైన్స్‌ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా విద్యాలయంలోని బాలికలకు వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలను డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమ తులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఎస్‌ కే. మిరున్నిస అంగన్వాడీ కార్యకర్తలు విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.