Aug 27,2022 23:01

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డిఇఒ చంద్రకళ, ప్రకాశరావు తదితరులు

ప్రజాశక్తి - ఆరిలోవ : పాఠశాల విద్యాశాఖ ముద్రించిన బాలికలపై వేధింపులు ఆపండి పోస్టర్‌ను బాల వికాస్‌ ఫౌండేషన్‌ సంస్థ ఆధ్వర్యాన శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిఇఒ సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఇఒ ఎల్‌.చంద్రకళ మాట్లాడుతూ, బాలికలపై శారీరక వేధింపులను ఆపే దిశగా పిల్లలను చైతన్య పరుస్తూ అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలను అభినందించారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని, అందుకు విద్యాశాఖ సహకారం ఉంటుందని చెప్పారు. బాలవికాస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశరావు మాట్లాడుతూ, పోస్టర్లను అన్ని పాఠశాలల నోటీసు బోర్డుల్లో డిస్‌ప్లే చేసి, అవగాహన సమావేశాలు నిర్వహించి, బాలికలను చైతన్య వంతులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి, దాసరి వేణుగోపాల్‌, రొక్కమ్‌ మధుసూధనరావు, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.