
ప్రజాశక్తి - బాపట్ల
బాలికలలో పటిష్టమైన నాయకత్వాన్ని పెంపొందించడంతోపాటు వారి శ్రేయస్సుకు అవసరమైన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ రంజిత్ భాషా అన్నారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పరస్కరించుకొని కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కైలాష్ సత్యార్థి తనయుడు, సుప్రీంకోర్టు అడ్వకేట్, రచయిత, సోషల్ యాక్టివిస్ట్ భువన్ రిభు రచించిన రీసెర్చ్ బుక్ వెన్ చిల్డ్రన్ పుస్తకాన్ని కలెక్టరేట్‌లో ఆయన బుధవారం ఆవిష్కరించారు. సమాజంలో బాలికా హక్కులను పరిరక్షించేందుకు కృషిజరగాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్న చిల్డ్రన్స్ ఫౌండేషన్ కార్యక్రమాలను ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో సిఫార్డు స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కొమరభత్తిని రవి ప్రదీప్, న్యాయవాది, యాక్టివిస్ట్ కట్టా శ్రీనివాసరావు, రాష్ట్రస్థాయి మాస్టర్ రిసోర్స్ పర్సన్ డి ఇమ్మానుయేల్, టుడే టీవీ ప్రతినిధి ఎన్ విల్సన్, సిఫార్డు స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు ప్రభాకర్, నాగరాజు, నాగేంద్ర, కిషోర్ బాబు పాల్గొన్నారు.