Apr 17,2023 23:56

సంస్థ అందజేసిన సైకిళ్లతో బాలికలు

ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం చిప్పాడ, దివీస్‌ ఆధ్వర్యాన 190 మంది బాలికలకు సోమవారం సైకిళ్లు పంపిణీ చేశారు. చిప్పాడ, అన్నవరం, పెద నాగమయ్యపాలెం, మూలకుద్దు, తూడెం పంచాయతీలకు చెందిన 190మంది బాలికలకు రూ.12 లక్షలా 79వేల విలువైన సైకిళ్లను సంస్థ డైరెక్టర్‌ మధుసూదనరావు సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలికల విద్యను ప్రోత్సహించడం, లింగ వివక్షను ఆరికట్టాలన్న ప్రధానోద్దేశంతో ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బాలికల విద్య ఆవశ్యకతపై ఏర్పాటుచేసిన సంతకాల మద్దతు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి చిప్పాడ సుత్తమ్మ తల్లి గుడి వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు దేవేంద్రరావు, రమణ, జనరల్‌ మేనేజర్లు ఎంఎస్‌ఎన్‌.రావు, వైఎస్‌.కోటేశ్వరరావు, ఇ.రామకృష్ణ, డిజిఎం బాలాజీ, భద్రతా విభాగం అధికారి చంద్రశేఖర్‌, సిఎస్‌ఆర్‌ అధికారి నాగరాజు, సురేష్‌ పాల్గొన్నారు.