సైకిళ్లు అందుకున్న బాలికలు
ప్రజాశక్తి -భీమునిపట్నం : మండలంలోని చిప్పాడ దివీస్ ఆధ్వర్యాన 5 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు చెందిన 190 మంది బాలికలకు స్థానిక ఎమ్మెల్యే ము త్తం శెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. దివీస్ సహకారంతో మండలంలోని 14 గ్రామ సచివాలయాలకు సుమారు రూ.14 లక్షలా 75 వేలు విలువైన మినీ ఆర్‌ఒ ప్లాంట్లను అందజేశారు. పారిశుధ్య నిర్వహణకు బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు నిమిత్తం రూ.1.10 లక్షల చెక్కును ఎండిఒ పి.వెంకటరమణకు అందజేశారు. చిప్పాడలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ ఎంఎస్‌ఎన్.రావు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.










