
చిట్వేలి : మండల పరిధిలో బాలికల వసతి గృహాలను పలు సమస్యలు వెంటాడుతున్నాయి. మండలంలో ఒక బాలికల వసతి గహం, రెండు బిసి వసతి గహాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క వసతి గహానికి రెగ్యులర్ వార్డెన్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హాస్టల్లో పనిచేసే హెడ్‌కుక్ పెత్తనం చేయడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయని విద్యా ర్థుల తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు. రాజంపేట, పుల్లంపేట, కోడూరు ప్రాం తాలలో విధులు నిర్వహిస్తున్న వార్డెన్లు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించి బాధ్యతను హెడ్‌కుక్‌కు వదలి వెళుతున్నారు. రాత్రి వేళల్లో స్టడీ అవర్స్‌లో చదువులో సమస్యలు ఏమైనా వస్తే ఎవరిని అడాగాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ వసతి గృహాలలో విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా హెడ్ కుక్ బాధ్యత వహిం చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అసలే బాలికల వసతి గహాల పట్ల కొనసాగుతున్న నిర్లక్ష్యం ఇప్పటిది కాదని, గత కొంతకాలంగా పాఠశాలలు ప్రారంభమైన దశ నుంచే ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. వంట మను షులు, హెడ్ కుక్‌ల మధ్య సయోధ్య లేనికారణంగా కారణంగా బాలికల సమ స్యలు వర్ణనతీతంగా వుందని ఆవేదన చెందు తున్నారు. ఇటీవల వసతి గహంలో చేరేందుకు వచ్చిన బాలికల తల్లిదండ్రులు ఇక్కడి పరిస్థితులు గవ ునించి మాను కున్నవారు ఎందరో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా సంబం ధిత ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించి, మానవత దక్పథంతో బాలి కలు వసతి గహాలకు పర్మినెంట్ హాస్టల్ వార్డెన్‌లను నియమించి రక్షణ కల్పించాలని బాలికల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.