మాట్లాడుతున్న ట్రాఫిక్ ఎస్‌ఐ చిరంజీవి
ప్రజాశక్తి -తగరపువలస : బాలికల సంరక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని భీమిలి ట్రాఫిక్ ఎస్‌ఐ సిహెచ్.చిరంజీవి చెప్పారు. జివిఎంసి ఒకటో వార్డు పరిధి బంగ్లా మెట్ట, ప్రాథమిక పాఠశాలలో సోమవారం 'బాలికలపై లైంగిక వేదింపులు ఆపండి' అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌ఐ చిరంజీవి మాట్లాడుతూ, ఆడపిల్లలకు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఉమెన్ హెల్ప్ లైన్ 181, దిశ హెల్ప్ లైన్ 112, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఎపి పోలీస్ 100, ఎమర్జెన్సీ 108కి ఫోన్ చేయాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెడ్డి పల్లి అప్పలరాజు,ఉపాధ్యాయులు మల్లిక, నాగమణి, రమేష్, హెడ్ కానిస్టేబుల్ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.










