బాలికల సింగిల్స్‌కు బంగారు పతకం బాలుర విభాగంలో నిపున్కు సింగిల్స్ టైటిల్

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ (ఐజీఎంసీ) స్టేడియంలో జరుగుతున్న 18వ జూనియర్ నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ బాలురు, బాలికల టోర్నమెంట్‌లో తమిళనాడు క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తమ విజయాల పరంపరను కొనసాగించారు. మంగళవారం జరిగిన జూనియర్ బాలికల విభాగంలో తమిళనాడు బాలికలు బంగారు, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకోగా, అదే విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ బాలిక ముత్యాల భావన కాంస్య పతకాన్ని గెలుచుకోవడం గమనార్హం. బాలికల సింగిల్స్ ఫైనల్స్‌లో తమిళనాడుకు చెందిన సాధన మరియు నరుముగై పోరాడారు. సాధన 3-1 సెట్లలో తన స్నేహితురాలు నరుముగైని ఓడించి జూనియర్ నేషనల్ సాఫ్ట్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఫలితాలు: బాలికల ఫైనల్స్: సాధన (తమిళనాడు) నరుముగై (తమిళనాడు)పై 3-1, సెమీ ఫైనల్స్: సాధన (తమిళనాడు) 3-1తో యాజిని (తమిళనాడు)పై, నరుముగ (తమిళనాడు) ఎమ్ భావన (ఆంధ్రప్రదేశ్), 3 -1
బాలుర ఫైనల్స్: నిపున్ (మధ్యప్రదేశ్) ఓం యాదవ్ (ఉత్తరప్రదేశ్)పై 3-1, సెమీ-ఫైనల్స్: నిపున్ (మధ్యప్రదేశ్) వీర్ జైన్ (మహారాష్ట్ర), 3-1తో ఓం యాదవ్ (ఉత్తరప్రదేశ్) రితిక్ శర్మ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందారు. హర్యానా) 3-1, (మధ్యప్రదేశ్), 2-3తో, వీర్ జైన్ (మహారాష్ట్ర) 3-2తో యశ్వంత్‌పై గెలుపొందారు.