Nov 05,2023 00:01

బాలికల హక్కులు, చట్టాలపై అవగాహన

బాలికల హక్కులు, చట్టాలపై అవగాహన
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: స్థానిక ఏపీ బాలికల గిరిజన సంక్షేమ జూనియర్‌ కళాశా లలో శ్రీకాళహ స్తి కోర్టు ఆధ్వర్యంలో బాలికల చట్టాలు, హక్కులపై శనివారం అవగా హన కల్పిం చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్‌ నాయక్‌ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే బాలికలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మహిళల అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న బాల్య వివాహాలు లాంటి సామాజిక రుగ్మతల నుంచి విముక్తి పొందచ్చని తెలిపారు. న్యాయ ఉచిత సలహాల కోసం 15100 నెంబరును సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు మల్లికార్జునయ్య, రాజేశ్వరరావు పాల్గొన్నారు.