Apr 15,2023 00:44
దుద్దుకూరులో ఇంటర్మీడియట్‌కు దత్తత తీసుకున్న విద్యార్థులు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: బాలికలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలకు, సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని కొరిశపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ పూనాటి రవీంద్ర సతీమణి సరోజిని సూచించారు. ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు ఆచార్య రంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తాటి ఇందిర మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (టైమ్స్‌) సంస్థ పక్షాన గత సంవత్సరం పదో తరగతి పూర్తి చేసిన ముగ్గురు బాలికలను గుంటూరు చైతన్య బాలికల కళాశాలలో ఉచితంగా చదివిస్తున్నామ న్నారు. సమావేశానికి ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఎన్‌ శ్రీనివాసాచార్యులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసిన పిల్లలను కూడా దత్తత తీసుకోవాలని సైన్స్‌ ఉపాధ్యాయుడు యు చెంచయ్య కోరారు.