
ప్రజశక్తి - చీరాల
పేదలకు అండగా వారికి సాయం చేయడంలో పద్మ భాస్కర్ ఫౌండేషన్ అన్ని వేళల ముందు ఉంటుందని ఫౌండేషన్ చైర్మన్ ఘంటా అనిల్ కుమార్ అన్నారు. 11సంవత్సరాల చిన్నారి చంద్ర ప్రవళిక ప్రాణాపాయ స్థితిలో ఉండి గుంటూరు ప్రభుత్వం హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా ఆ చిన్నారి కుటుంబ ఆర్ధిక ఇబ్బందులను గుర్తించి హాస్పిటల్ వైద్యానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. చిన్నారి ప్రవళ్లికా ఆరోగ్యంగా కోలుకోవాలని కోరారు. ఆ కుటుంబానికి సాయం అందించటం అనందంగా ఉందని అన్నారు. సమాజ సేవలో యువత తమ వంతు బాధ్యతగా ఉంటూ ఆపదలో ఉన్న వారికి చేయూత అందించాలని కోరారు.