Aug 25,2023 00:10

విచారణ చేపడుతున్న అధికారులు

ప్రజాశక్తి -యస్‌.రాయవరం:మండలంలో ఇటీవల బంగారమ్మపాలెంలో డెంగీతో బాలిక మృతి చెందడంపై గురువారం జిల్లా మలేరియా అధికారి కె.వరహాలుదొర, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎస్‌ ఎస్‌ వి.శక్తి ప్రియ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మెడికల్‌ ఆఫీసర్‌ శక్తిప్రియ మాట్లాడుతూ, బాలికకు 13వ తేదీన జ్వరం రావడంతో ఆర్‌ఎంపీ వద్ద వైద్యుఇన ఆశ్రయించారని, 16న పిట్స్‌ రావడంతో నక్కపల్లి ఏరియా ఆసుపత్రికి, అనకాపల్లి ఎన్టీఆర్‌ హాస్పిటల్‌కు పరిస్థితి విషమించడంతో కెజిహెచ్‌కు తరలించారన్నారు. 20న కె .జి.హెచ్‌ లో మృతి చెందిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి వరహాల దొర మాట్లాడుతూ, ఆర్‌ఎంపీల వద్ద వైద్యం తీసుకోవడంతో బాలిక మృతి చెందదని, ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలన్నారు.అంతరం ఆ గ్రామంలో మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి నాయుడు, ఆరోగ్య విస్తరణ అధికారి టి.నాగేశ్వరరావు, హెల్త్‌ విజిటర్‌ ఎస్‌.సూర్యకుమారి పాల్గొన్నారు.