Jul 31,2023 20:51

బాలిక కుటుంబ సభ్యులతో మాజీ ఎమ్మెల్యే బీవీ

ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలోని గంజిహళ్లి గ్రామంలో గతనెల 19న అత్యాచారయత్నానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను సోమవారం రాత్రి ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ.జయ నాగేశ్వరరెడ్డి టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి టిడిపి తరఫున బాలిక కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండున్నర ఏళ్ల క్రితం మండలంలోని ఎర్రబాడు గ్రామంలో హాజీరాబీ అనే యువతిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఒక బీసీ వర్గానికి చెందిన బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వారిపై కందితుడుపుగా కేసులు నమోదు చేశారని విమర్శించారు.