Jun 21,2023 17:31

కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్న లేబర్‌ అధికారులు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

ప్రజాశక్తి - చాగలమర్రి

బడిఈడు పిల్లలు బడిలో ఉండకుండా కూలి పనులకు పంపించడం చట్టరీత్యా నేరమని, జిల్లా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తామని నంద్యాల జిల్లా సహాయ కార్మిక అధికారులు మురళీకృష్ణ, సమీర్‌, విద్యావతమ్మలు తెలిపారు. బుధవారం చాగలమర్రి పట్టణంలో కార్మిక శాఖ,ఐసిడిఎస్‌, పోలీసు శాఖల ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పట్టణంలోని వ్యాపార సముదాయాలు,మెకానిక్‌ షెడ్లు,కుటీర పరిశ్రమలు తదితర ప్రదేశాలలో తనిఖీలు చేపట్టి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తల్లిదండ్రులు తమతమ పిల్లలను బడులకు పంపాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు చంద్రకళ,హసీనా, వహిదా,రహమ్మత్‌,పోలీస్‌ సిబ్బంది శ్రీరామ్‌లు పాల్గొన్నారు.